అమ్మలా మారి చనుబాలు పట్టిన నాన్న

నిజమే నాన్న ఎప్పుడూ కూతురివైపే ఉంటాడు. భార్య ఎంత కష్టపడుతున్నా చూసి చూడనట్లు ఉంటాడు. కూతురు నీళ్ల బకెట్ మోసినా పాపం తట్టుకోలేడు. భార్య బిర్యానీ చేసినా కాంప్లిమెంట్ ఇవ్వడు. కూతురు నూడిల్స్ చేసినా అదో గిన్నీస్ రికార్డ్ లా అందరికీ చెప్పుకుంటాడు పిచ్చినాన్న. లోకంలో శుభాలన్నీ తనకూతురికే కలగాలనుకుంటాడు. ఏ కష్టం దగ్గరికి రాకుండా అడ్డుగోడలా ఉంటాడు. నాన్నంటే కనిపించే భరోసా మాత్రమే కాదు. నాన్నంటే ముందున్న బిడ్డ భవిష్యత్తుని బంగారం చేసిన దేవుడు కూడా.

అమ్మ ఎంతతిట్టినా నవ్వొస్తుంది. కానీ నాన్న కొద్దిగా మందలించినా కూతురికి ఏడుపొచ్చేస్తుంది. నాన్న గుండెలో కూతురికి ప్రథమస్థానమే. నాన్నకి ఆ కూతరే ప్రపంచం. మరి అంతగా ప్రేమించే కూతురు పాలకోసం ఏడుస్తుంటే నాన్న ఊరుకుంటాడా..? చెప్పండి. ఊరుకోడు..! తానే తల్లినై చనుబాలతో కూతురికి పాలిచ్చి ఆకలి తీరుస్తాడు. తన కూతురు పాలకోసం ఏడుస్తుంటే ఓ తండ్రి పాలిచ్చిన వైనం సోషల్ మీడియాలో చక్కెర్లుకొడుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు కూతురిపై తండ్రికి ఉన్న మమకారం చూసి ఫిదా అవుతున్నారు.

స్టేన్స్ గ్రౌండెడ్ అనే నెటిజన్ ఓ వీడియో ట్వీట్ చేశాడు. ఆకలితో ఏడుస్తున్న తన కూతురికి ఓ తండ్రి పాలబాటిల్ని నోట్లో పెట్టాడు. ఎప్పుడు తల్లి చనుబాలు తాగే ఆ పసికందుకు బాటిల్లో పాలు రుచించకపోవడంతో మారం చేస్తుంది. దీంతో కూతురు ఆకలి తీర్చేందుకు తల్లి తన చనుబాలతో పాలు ఎలాఅయితే పడుతుందో.. తండ్రి కూడా అచ్చం పాలబాటిల్ తో అలాగే పాలు తాపించాడు. ప్రస్తుతం ఈ వీడియోను 5కోట్ల మందికి పైగా వీక్షించారు.

Latest Updates