వావ్.. రియల్ ట్యాలెంట్ అంటే ఇదే!

యువకుడి బ్యాక్ ఫ్లిప్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్స్
న్యూఢిల్లీ: మానవ శరీరం అద్భుతమని శాస్త్రవేత్తలు అంటుంటారు. సరైన శిక్షణతో మన శరీరాలతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. క్లాసికల్ డ్యాన్స్ ఆర్ట్ అయిన భరతనాట్యంతోపాటు వెస్ట్రర్న్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేయొచ్చు. యోగా ప్రాక్టీస్ తో శరీరాన్ని రబ్బరులా వంచొచ్చు. వీటిని పక్కనబెట్టి ఒక మెస్మరైజింగ్ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలోని వ్యక్తి బ్యాక్ ఫ్లిప్స్ ను చేసిన తీరు చూస్తే మన శరీరంతో ఎన్ని విన్యాసాలో చేయొచ్చో తెలుస్తుంది. దేనికైనా ప్రాక్టీస్, టెక్నిక్ కీలకం అనుకోండి. విక్రమ్ సెల్వమ్ అనే సదరు యువకుడు జిమ్నాస్ట్ అని అతడి ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది. అతడి బ్యాక్ ఫ్లిప్స్ చూస్తుంటే ఏంటి ఇంత ఈజీనా ఇలా దూకడం అనిపిస్తుంది. కానీ వాటి వెనుక నిరంతర పరిశ్రమ, పట్టుదల ఉండే ఉంటాయి. 7.4 మిలియన్ల మంది చూసిన ఈ వీడియోను మీరూ చూడండి మరి. వీడియో చూసిన నెటిజన్స్ వావ్, ఆసమ్, అమేజింగ్, రియల్ ట్యాలెంట్ అంటే ఇదేనంటూ సెల్వమ్ ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Latest Updates