కోతి అయినా కునుకు తీయాల్సిందే.. మంకీ న్యాపింగ్ వీడియో వైరల్

న్యూఢిల్లీ: మనలో చాలా మంది కునుకు తీస్తుంటాం. అలుపు లేకుండా పని చేయడంతో అలసి పోవడం వల్ల కునుకు తీయడం కామన్. ఒక్కోసారి నిద్రపోవాల్సిన చోటు కాకున్న ఆదమరిచి కునుకు తీస్తుంటాం. లేచాక నవ్వుకోవడమూ షరా మామూలే. తాజాగా ఓ కోతి కూడా చెట్టు కింద ఇలా కునుకు తీసింది. ఈ వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది.

సదరు కోతి కునుకు తీసిన వీడియోను సుధా రామన్ అనే ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. 14 సెకన్‌ల ఈ వీడియోలో చెట్టు కింద కునుకు తీస్తున్న కోతి చివర్లో తను పడుకోవాల్సిన చోటు అది కాదేమో అనేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. మీరూ ఇలాంటివి చేసుంటే ఈ వీడియోను చూడండి అని సుధా రామన్‌ పోస్ట్‌కు క్యాప్షన్ జత చేశారు. నాతో కూడా ఇలా జరిగింది, కాలేజీ రోజుల్లో లెక్చర్ టైమ్‌ ఇలానే జరిగింది, స్కూల్‌ డేస్ స్టడీ అవర్స్‌లో ఇలా జరిగిందంటూ ట్విట్టర్‌‌ యూజర్లు ఈ పోస్ట్‌కు కామెంట్స్‌ చేస్తున్నారు.

Latest Updates