బాధను దాచుకోలేక ఇలా చేస్తున్న:విద్యాబాలన్

vidyabalan-dhoon-badalke-dheko-programm-start-in-fm-channel

అందమైన శరీరాకృతిని కలిగి ఉండటం ఒక వరమే. అదీ గ్లామర్‌‌‌‌కి పెద్ద పీట వేసే సినీ ప్రపంచంలో మంచి ఫిజిక్ మరీ అవసరం. అలా అని లావుగా ఉన్నవాళ్లు సినిమాలకు పనికి రారనడం తప్పు అని నిరూపించింది విద్యాబాలన్. అయితే ఆమె లావుగా ఉండటం గురించి చాలామంది కామెంట్ చేస్తుంటారు. అలా చేయొద్దంటూ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ట్రోలింగ్ ఆగట్లేదు. దాంతో తన బాధని, తనలాగే ఈ సమస్య ఎదుర్కొంటున్న వారి బాధను తెలియజేసేందుకు ఒక ఎఫ్​ఎం చానెల్‌‌లో ‘ధున్​ బదల్​కే దేఖో’ అనే కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

స్థూలకాయం కారణంగా అవమానాలు పొందినవారు దీని ద్వారా తమ ఆవేదన పంచుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్​ కోసం ‘ఇతరుల శరీరాకృతిని చూసి వెక్కిరించొద్దు’ అంటూ రాసిన  పాటను విద్య పాడుతుంటే ఇటీవల షూట్ చేశారు. అయితే ఆ పాట పాడేటప్పుడు తాను ఎదుర్కొన్న అవమానాలన్నీ గుర్తొచ్చి  ఏడ్చేసింది విద్య. దాన్ని అలాగే షూట్ చేసి రిలీజ్ చేశారు. దాన్ని చూసినవాళ్లంతా ఆమె ఎంత ఆవేదన అనుభవించిందో అర్థమై కదిలిపోతున్నారు. ఎదుటివారి శరీరం గురించి చీప్​గా మాట్లాడి  బాధపెట్టేవారు కూడా మారితే మంచిదే మరి.

Latest Updates