బంపర్ ఆఫర్ : రూ.9కే విమాన టికెట్

న్యూఢిల్లీ : ఇండియాలోకి మరో కొత్త జెట్ విమానసంస్థ ఎంట్రీ ఇస్తోంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వస్తూనే బంపర్ ఆఫర్లను అనౌన్స్ చేసింది. వియత్నాంకు చెందిన వియెట్‌ జెట్‌ సరికొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది.   వియత్నాంకు చెందిన వియత్‌ జెట్‌ విమానయాన సంస్థ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇండియా-వియత్నాం మధ్య డిసెంబరు నుంచి విమాన సేవలను ప్రారంభించనున్నట్లు వియెట్ జెట్‌ మంగళవారం తెలిపింది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది.  హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది  సంస్థ.

టికెట్ల ప్రారంభ ధర రూ. 9 
అంతేకాదు మరో బంపర్‌ ఆఫర్‌ కూడా ఉంది.  త్రి గోల్డెన్‌ డేస్‌ పేరుతో స్పెషల్‌ ప్రమోషన్‌ సేల్‌ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ. 9 ప్రారంభ ధరతో సూపర్-సేవింగ్ టిక్కెట్లను అందిస్తోంది. వ్యాట్, ఎయిర్ పోర్ట్ ఫీజు, సర్ ఛార్జీలు అదనం. అవి కూడా ఫస్ట్ 8 వేల టికెట్స్ కు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది సంస్థ. విస్తరిస్తున్న నెట్‌ వర్క్‌ లో  ఇండియా తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా ఉందని వియెట్ జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్‌ తన్ సన్ తెలిపారు.

Latest Updates