ఫ్రీగా ట్రంప్, కిమ్ హెయిర్ కట్స్.. వియత్నాంలో ట్రెండింగ్

ప్రపంచాన్ని ఆకర్షించిన ఇద్దరు దేశాధినేతలకు వియత్నాం ప్రజలు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నారు. వియత్నాం దేశంలోని హనోయ్ సిటీలో ఫిబ్రవరి 27-28 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య సమావేశం జరగనుంది. వీరిద్దరి హెయిర్ స్టైల్ కు వరల్డ్ వైడ్ గా పాపులారిటీ ఉంది. ట్రెండీ హెయిర్ కట్ కిమ్ ది అయితే… ట్రంప్ ది గోల్డెన్ కలర్ హెయిర్. వీరిద్దరి స్టైల్ లో హెయిర్ కట్ ను ఉచితంగా చేస్తున్నారు వియత్నాంలోని బార్బర్స్. తమ హెయిర్ సెలూన్ కు వచ్చే వారికి… కిమ్, ట్రంప్ స్టైల్ కటింగ్, పెయింటింగ్ చేసిస్తామని ఆఫర్లు పెట్టారు. ఇది ఆ ఇద్దరు నేతలకు తాము చెబుతున్న గ్రాండ్ వెల్కమ్ అంటున్నారు.

కిమ్ స్టైల్ ను యూత్… ట్రంప్ స్టైల్ ను పెద్దవాళ్లు ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం వియత్నాంలో ఈ ఇద్దరు నేతల సమావేశంపైనే చర్చ జరుగుతోంది. ఈ మీటింగ్ జరిగేవరకు అక్కడ ట్రంప్, కిమ్ పేర్లు మోతమోగడం ఖాయంగా కనిపిస్తోంది.

రైలు, కారులో జర్నీ చేస్తూ వియత్నాంకు కిమ్

వచ్చేవారం వియత్నాంలోని హనోయ్ నగరంలో డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య సమావేశం జరగనుంది. ట్రంప్ తో సమావేశానికి .. నార్త్ కొరియా లోని ప్యోంగ్ యాంగ్ నుంచి… చైనా మీదుగా..  వియత్నాంలోని హనోయ్ వరకు ట్రైన్ లో కిమ్ వస్తాడని సమాచారం. వందల కిలోమీటర్ల దూరం రైలులోనే ప్రయాణిస్తారని తెలిసింది. వియత్నాం బోర్డర్ లోని డోంగ్ డాంగ్ స్టేషన్ వరకు రైల్లో రానున్నాడు కిమ్. ఆ తర్వాత.. అక్కడినుంచి కారులో 170కి.మీ. పాటు జర్నీ చేసి వియత్నాంలోని సమావేశ ప్రాంతానికి వెళ్తాడని తెలుస్తోంది. ఈ ప్రయాణానికి 2.30 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.

ఈ సమ్మిట్ కు టాప్ ప్రయారిటీ ఇచ్చి సెక్యూరిటీ అరేంజ్ మెంట్స్ చేస్తున్నామని వియత్నాం ప్రైమ్ మినిస్టర్ ఎన్ గ్యుయెన్ జువాన్ చెప్పారు.

Latest Updates