అంగుళం భూమినీ ఎవరూ ఆక్రమించుకోలేరు

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత విషయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నామని కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చెప్పారు. దేశ భూభాగంలోని ప్రతి అంగుళాన్ని పహారా కాయడంపై మోడీ సర్కార్ పని చేస్తోందన్నారు. ‘దేశ భూభాగంలోని ప్రతి ఇంచు భూమిని కాపాడటంలో అప్రమత్తంగా ఉంటున్నాం. దీన్ని ఎవ్వరూ తీసుకుపోలేరు. దేశ సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను రక్షించుకునే పటిమ, సామర్థ్యం మన రక్షణ దళాలు, నాయకత్వానికి ఉన్నాయి’ అని షా స్పష్టం చేశారు. వచ్చే బిహార్ ఎన్నికల గురించి షా మాట్లాడుతూ.. ‘బిహార్ ఎలక్షన్స్‌‌లో స్పష్టమైన మెజారిటీతో విజయం సాధిస్తాం. ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రానికి నితీశ్ కుమార్ తదుపరి సీఎం అవుతారు’ అని చెప్పారు. రాబోయే బెంగాల్ ఎన్నికల్లోనూ గెలుపు సాధించి, అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Updates