విజయ్ దేవరకొండ సుకుమార్ క్రేజీ కాంబో

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్టయింది. యూత్ లో మంచి క్రేజ్  సంపాదించుకున్న విజయ్ దేవర కొండ..సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతోంది.  ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సుకుమార్ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నానని చెప్పాడు. తమ కాంబినేషన్ లో వచ్చే మూవీ కచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నాడు. ఈ కాంబినేషన్ కోసం తనలోని ప్రేక్షకుడు సెలబ్రిట్ చేసుకుంటాడన్నారు.  సుకుమార్ తో సెట్ లో అడుగు పెట్టేందుకు ఎదురుచూస్తున్నానని అన్నాడు. ఈ మూవీని ఫాల్కన్ క్రియేషన్ బ్యానర్ పై కేదర్ సెలగమ్ శెట్టి నిర్మిస్తున్నారు. విజయ్ దేవర కొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఫైటర్ సినిమాలో నటిస్తున్నారు.

 

Latest Updates