విజయ్ ఫ్యాన్సా మజాకా..!

పూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబో అంటేనే పక్కా మాస్ అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా అనుకుంటున్నప్పట్నుంచే అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి. అయితే.. విజయ్ ని ముద్దుగా రౌడీ అని పిలుచుకునే ఫ్యాన్స్ .. ఈ సినిమా ప్రచారాలు అప్పుడు షురూ చేశారు. ఓ అభిమాని అయితే ఏకంగా తాను కొత్తగా కొనుక్కున్న ఆడి కారుకు నంబర్ ప్లేట్ ప్లేస్ లో రౌడీ అని రాయించుకున్నాడు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. డాషింగ్ డైరెక్టర్ పూరి – విజయ్ కాంబోలో వస్తున్న ఫైటర్ మూవీ కోసం ఆల్ రౌడీ ఫ్యాన్స్ వెయిటింగ్ అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. దటీజ్ రౌడీ క్రేజ్ అంటున్నారు. ఈ క్రేజీ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Latest Updates