మహర్షి మూవీ నాలో ప్రెషర్ పెంచింది:  విజయ్ దేవరకొండ

మహర్షి సినిమా ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. గెస్ట్ గా హాజరైన విజయ్ దేవరకొండ… మహర్షి ఆడియో సీడీని విడుదల చేశాడు. ఆ తర్వాత మాట్లాడి అభిమానులను అలరించాడు విజయ్ దేవరకొండ.

“ఒకప్పుడు మహేశ్ బాబు సినిమా టికెట్లను కొనుక్కుని బాల్కనీలో కూర్చుని సినిమా చూసేవాన్ని. అలాంటిది.. మహేశ్ బాబు సినిమా ప్రోగ్రామ్ కు ఓ గెస్ట్ గా రావడం గ్రేట్ గా ఫీలవుతున్నా. పెళ్లి చూపులు మూవీకి మొదటిసారి మహేశ్ బాబు ట్వీట్ చేయడం గొప్పగా ఫీలయ్యాను. ఒకప్పుడు మహేశ్ మావోడు అనుకుని పేరు పెట్టి పిలిచేవాన్ని. ఇపుడు సర్ అని పిలవడం కొత్తగా అనిపిస్తోంది. మే 9న మహర్షి సినిమా వస్తోంది. అదే రోజు నా పుట్టినరోజు. ఓ ఫ్యాన్ గా .. మహర్షి సినిమా నాలో ప్రెషర్ పెంచుతోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని నమ్ముతున్నా. ఆయన గర్వపడే సినిమాలే చేస్తానని చెబుతున్నా” అన్నాడు విజయ్ దేవరకొండ.

Latest Updates