విజయ్-తరుణ్ ల ‘మీకు మాత్రమే చెప్తా’ ట్రైలర్

విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తా మూవీ ట్రైలర్ విడుదలైంది. ముందునుంచి ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా ఉంది ట్రైలర్. ట్రైలర్ లో చూపించిన ప్రతి డైలాగ్ ఆసక్తిరేపుతుంది. యూట్యూబ్ అంటే తెలియనివారు లేని ఈరోజుల్లో.. ట్రెండ్ కు తగ్గ కంటెంట్ తో వస్తోంది ఈ మూవీ. డైలాగుల్లోనూ కామెడీ పంచ్ పేలింది. తొందరగా జనాలకు కనెక్ట్ అవుతుంది.  కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ త్వరలోనే విడుదలకు రెడీ అవుతోంది.

పెళ్లిచూపులు మూవీతో విజయ్ దేవరకొండకు మంచి ల్యాండ్ మార్క్ హిట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ కు.. ఓ ఫ్రెండ్ గా… ఈ మూవీతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు విజయ్ దేవరకొండ. తన ఫ్రెండ్ ను హీరో చేసేందుకు తానే ఈసారి ప్రొడ్యూసర్ గా మారాడు. ఈ కాంబినేషన్ పై యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. తరుణ్ భాస్కర్… యూత్ ఫుల్ సినిమాలకు కేరాఫ్ కావడంతో… మీకు మాత్రమే చెప్తా కూడా అదే జానర్ లో తెరకెక్కింది.

షమ్మీర్ సుల్తాన్ రచించి , దర్శకత్వం వహించిన ఈ మూవీకి శివకుమార్ మ్యూజిక్ అందించాడు. కమెడియన్ అభినవ్, అనసూయ లీడ్ రోల్స్ పోషించారు.

 

Latest Updates