జయలలిత బయోపిక్..శోభన్ బాబుగా విజయ్ దేవరకొండ.?

విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందుకే గత చిత్రాలు కొన్ని నిరాశపర్చినా అతని తర్వాతి మూవీ కోసం క్యూరియస్‌గా ఎదురు చూస్తున్నారు. అతడు కూడా వరల్డ్ ఫేమస్ లవర్, ఫైటర్ అంటూ క్రేజీ ప్రాజెక్టులతో ఊరిస్తున్నాడు. ఇదిలా ఉంటే అతడు త్వరలో ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా మరేదో కాదు… తలైవి. జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తీస్తున్న ఈ మూవీలో జయ పాత్రలో కంగన నటిస్తున్న సంగతి తెలిసిందే. కరుణానిధి పాత్రను ప్రకాష్‌రాజ్, ఎంజీఆర్‌‌ రోల్‌ను అరవిందస్వామి పోషిస్తున్నారు. అయితే ఈ మూవీలో జయలలితకి శోభన్‌బాబుతో ఉన్న స్నేహాన్ని కూడా చూపించనున్నారట. అందుకే శోభన్‌ బాబు పాత్రకి విజయ్‌ని సంప్రదిస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలాడుతున్నారు. అయితే అతడు ఒప్పుకున్నాడా లేదా, అసలీ వార్త నిజమా కాదా అని చెప్పడానికి ఆధారాలైతే లేవు. ఒకవేళ నిజమైతే టీమ్‌లోని ఎవరో ఒకరు కన్‌ఫర్మ్ చేస్తారు కాబట్టి అంతవరకూ వెయిట్ చేయడమే.