రివ్యూ: వరల్డ్ ఫేమస్ లవర్

రివ్యూ: వరల్డ్ ఫేమస్ లవర్

రన్ టైమ్: 2 గంటల 35 నిమిషాలు

నటీనటులు: విజయ్ దేవరకొండ,రాశి ఖన్నా,ఐశ్వర్య రాజేష్,కేథరిన్ థెరిసా, ఇజబెల్ల,ప్రియదర్శి తదితరులు

సినిమాటోగ్రఫి: జయకృష్ణ

మ్యూజిక్: గోపి సుందర్

నిర్మాత: కె.ఎస్ రామారావు

రచన,దర్శకత్వం: క్రాంతి మాధవ్

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 14,2020

కథేంటి?

గౌతమ్ (విజయ్ దేవరకొండ) యామిని (రాశిఖన్నా) సహజీవనం చేస్తుంటారు. స్వతహాగా రైటర్ అయిన గౌతమ్ జాబ్ మానేసి రైటింగ్ మీద కాన్సన్ ట్రేట్ చేయాలనుకుంటాడు.కానీ ఏడాదిన్నర దాటిపోయినా ఏమీ రాయడు. అది యామినికి నచ్చక బ్రేక్ అప్ చేసి వెళ్లిపోతుంది.అప్పుడు ఫ్రస్టేట్ అయిన గౌతమ్ ఏం చేశాడు.తర్వాత ఎలాంటి బుక్ రాశాడు.మళ్లీ వాళ్లిద్దరూ కలిసారా లేదా అనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

విజయ్ దేవరకొండ తనవరకు చాలా ఎఫర్ట్స్ పెట్టి నటించాడు.నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి రాణించాడు.రాశిఖన్నా బాగా చేసింది.తనకు మంచి పాత్ర దక్కింది.ఐశ్వర్య రాజేశ్ పాత్ర ఆకట్టుకుంటుంది.ఆ రోల్ లో తను చాలా బాగా నటించింది.కేథరిన్ రోల్ కాస్త డిస్ట్రబెన్స్ గా అనిపిస్తుంది.ఆమె నటన యవరేజ్.ఇజబెల్లె బాగా చేసింది. శత్రు,అనిల్,ప్రియదర్శి లు ఆకట్టుకున్నారు.

టెక్నికల్ వర్క్:

జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది.గోపిసుందర్ ఇచ్చిన పాటలు అస్సలు బాగా లేవు.మ్యూజిక్ పరంగా వీక్.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే.ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. ఆర్ట్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది.ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.డైలాగులు బాగున్నాయి.

విశ్లేషణ:

‘‘వరల్డ్ ఫేమస్ లవర్’’ క్లారిటీ లేని ఓ లవ్ స్టోరీ.సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ చెప్పాలనుకున్న పాయింట్ లో స్పష్టత లేదు.తను అనుకున్న పాయింట్ డిఫరెంట్ గానే అనిపించినా..ట్రీట్ మెంట్ లో లోపముండటం వల్ల అస్సలు కనెక్ట్ అవ్వదు. అంతో ఇంతో ఫస్టాఫ్ లో విజయ్ –ఐశ్వర్య రాజేశ్ చేసిన ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా ఫస్టాఫ్ ఫర్వాలేదనిపించినా..సెకండాఫ్ ట్రాక్ తప్పింది. పారిస్ ఎపిసోడ్ లో సోల్ మిస్ అయింది.ఆ తర్వాత క్లైమాక్స్ ఇంకా వీక్. తద్వారా సినిమా బోరింగ్ గా ఫీల్ అవుతారందరు.విజయ్ తన శాయాశక్తులా పోరాడాడు. స్క్రీన్ ప్లే వీక్ ఉన్న ప్రతీ సీన్ ను తన నటనతో నిలబెట్టాలని చూశాడు.కానీ కథనం మరీ మందకొడిగా సాగడంతో ఓ దశలో తను కూడా బోర్ కొట్టేస్తాడు.ఓవరాల్ గా ‘‘వరల్డ్ ఫేమస్ లవర్’’ నిరాశపరుస్తాడు.

Latest Updates