వకీల్ సాబ్ మూవీతో విజయ్ మల్టీప్లెక్స్‌ ఓపెన్

V6 Velugu Posted on Mar 22, 2021

హైదరాబాద్: తెలుగు ఫిల్మ్ స్టార్స్ సినిమాలతోనే గాక ఇతర ఆదాయం, వ్యాపారాల పైన దృష్టి పెడుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబునే తీస్కుంటే ఆయనకు ఏఎంబీ అనే మల్టీప్లెక్స్ ఉంది. ఏషియాన్ సినిమాస్‌‌తో కలసి ఆయన ఏఎంబీకి శ్రీకారం చుట్టారు. ఇందులో థియేటర్స్‌‌తోపాటు షాపింగ్ మాల్‌‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రిన్స్ బాటలోనే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా నడుస్తున్నాడు. సొంత మల్టీప్లెక్స్‌‌ నిర్మాణ పనుల్లో విజయ్ బిజీగా ఉన్నాడు. 

తెలంగాణలో థియేటర్స్ చైన్‌‌లో లీడింగ్‌‌లో ఉన్న ఏషియన్ సినిమాస్‌‌తో కలసి తన సొంతూరు మహబూబ్‌‌నగర్‌‌లో ఏవీడీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌‌ను విజయ్ రెడీ చేస్తున్నాడు. పవర్‌‌స్టార్ పవన్‌కల్యాణ్ భారీ గ్యాప్ తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ రిలీజ్‌‌తో ఏవీడీ సినిమాస్ ఓపెన్ కానుందని సమాచారం. ఏప్రిల్‌‌లో వకీల్ సాబ్ తెర మీదకు రానుంది. వచ్చే కొన్నేళ్లలో మరిన్ని టౌన్‌‌ల్లో మల్టీప్లెక్స్‌‌ వ్యాపారాన్ని విస్తృతం చేయాలని రౌడీ స్టార్ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ ఆల్రెడీ రౌడీ పేరుతో ఓ ఫ్యాషన్ బ్రాండ్‌‌ బిజినెస్ నడుపుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఓ ప్రొడక్షన్ హౌస్‌‌ను స్థాపించాడు. ఇకపోతే, ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్‌‌లో ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. 

Tagged business, Mahabubnagar, Vijay Deverakonda, Multiplex

Latest Videos

Subscribe Now

More News