విజయ దేవరకొండ న్యూ మూవీ.. హీరోయిన్?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ , రౌడీ  విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో కొత్త మూవీ స్టార్ట్ అయ్యింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ పూజ కార్యక్రమం ఇవాళ ముంబైలో జరిగింది. నటి చార్మి విజయ్ పై  క్లాప్ కొట్టి ప్రారంభించారు. హిందీ, సౌత్ ఇండియాలోని అన్నిభాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. పూరి జగన్నాథ్, ఛార్మి,  బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్  ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రారంభించిన ఫోటోలు,వీడియో చార్మి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మూవీ టైటిల్ ప్రస్తుతం ఫైటర్ అనుకుంటున్నారు. ఇంకా టైటిల్  ను కూడా కన్ఫర్మ్ చేయలేదు. విజయ్ దేవర కొండకు ఈ మూవీ 10వ సినిమా కాగా పూరిజగన్నాథ్ కు 37 వ సినిమా.

అయితే ఈ మూవీకి హీరోయిన్ ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రేదేవి కూతురు జాన్వీ కపూర్ ను తీసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కానీ లేటెస్ట్ గా బాలీవుడ్ నటి అనన్య పేరు ప్రచారంలో ఉంది. వీరిలో ఎవరిని తీసుకుంటారనేది చూడాలి మరి.

see more news

రైల్లో పరిచయం .. లాడ్జిలో అత్యాచారం

పిల్లలు బెట్టింగ్ ఉచ్చులో చిక్కితే ఇలా కనిపెట్టొచ్చు

Latest Updates