మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ టైటిల్ దక్కించుకున్న రౌడీ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ టాలెంట్‌ ఏంటో అందరికీ తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించుకున్న విజయ్ తన ఫ్యాషన్, యాటిట్యూడ్ తో తక్కువ సమయంలో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు.

తాజాగా “హైదరాబాద్ టైమ్స్ 30 మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019” లిస్ట్ లో విజయ్ దేవరకొండ కు నెంబర్ వన్ ర్యాంక్ ను దక్కించుకున్నాడు. 2017 సం లో  నెంబర్ 2 ప్లేస్, 2018 లో నెంబర్ 1 ప్లేస్, 2019 లో అదే స్థానం నిలబెట్టుకున్నారు.2020 లో కూడా తానే నెంబర్ 1 నిలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు విజయ్ దేవర కొండ.  రొటీన్ కు భిన్నంగా స్క్రిప్ట్స్ ను ఎంపిక చేసుకోవడం, చేసే వర్క్ కాన్ఫిడెన్స్ గా పూర్తి చేయడం  తన సక్సెస్ కు సీక్రెట్స్ అని తెలిపాడు.

Latest Updates