మింత్రాతో జతకట్టిన విజయ్ దేవరకొండ ‘రౌడీ‘

రౌడీ స్టార్ విజయ్ దేవర కొండ  వ్యాపార రంగంలో మరో ముందడుగు వేశాడు. తన రౌడీ వేర్ ను దేశ వ్యాప్తంగా అందించేందుకు  ప్రముఖ ఆన్ లైన్  ఈ కామర్స్ మింత్రాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. హైదరాబాద్ లోని  జూబ్లీ 800 లోజరిగిన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్  సెంకడ్ సన్ డౌనర్ పార్టీలో రౌడీ వేర్ అమ్మేందుకు మింత్రాతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ప్రకటించాడు.  ఫ్యాన్స్ తో కలిసి కాసేపు సందడి చేశాడు. తన రౌడీ వేర్ ను  ఫ్యాన్స్ కు ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ  జనాల్లో కాన్ఫిడెన్స్ ను పెంచేందుకు ఈ రౌడీ వేర్ అని అన్నారు. ఇప్పటి వరకు రౌడీ యాప్ ద్వారా మాత్రమే రౌడీ వేర్ అందుబాటులో ఉండేదన్నారు.  రౌడీ యాప్ ను 1.5 మిలియన్లు యూజ్ చేస్తున్నారన్నారు.  ఇపుడు మింత్రాతో కలవడం వల్ల దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ లో రౌడీ వేర్ అందుబాటులో  ఉంటుందన్నారు. పిబ్రవరి 12 నుంచి ఆన్ లైన్ మింత్రాలో రౌడీ వేర్ ను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఇకపై రౌడీ వేర్ మరింతమందికి చేరువవుతుందన్నారు విజయ్ దేవరకొండ.

Latest Updates