విజయ్ ఎంపిక జట్టుకు మేలు: కోహ్లీ

వరల్డ్‌ కప్‌ కు ఎంపిక చేసిన 15 మందిలో విజయ్‌ శంకర్‌ కు చోటు దక్కడం పట్ల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. విజయ్‌ రాకతో జట్టుకు ఎంతో మేలు జరుగుతుందని అన్నాడు. రిషభ్‌ పంత్‌ , అంబటిరాయుడును వరల్డ్‌ కప్‌కి సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంపై విమర్శలు రేగిన నేపథ్యం లో జట్టు ఎంపికలో తమ నిర్ణయాన్నివిరాట్‌ సమర్ధించుకున్నాడు. ప్రపంచకప్‌కు ఎంపికైన జట్టు పట్ల సంతృప్తిగా ఉన్నానన్న కోహ్లీ , ఆటగాళ్లంతా మంచి ఫామ్‌ లో ఉన్నారని చెప్పాడు. ధోనీపై విమర్శకులు దాడి చేయడాన్ని దురదృష్టమన్న కోహ్లీ, విధేయతకు ప్రాధాన్యమిస్తానని తెలిపాడు. తొలిసారి ఇండియా జట్టులోకి వచ్చినప్పుడు ధోనీ అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనన్నాడు. మొదటి బంతి నుంచి గేమ్‌ ను పూర్తిగా చదవగలిగే సామర్థ్యమున్న ధోనీ ఉండడం జట్టుకు గౌరవమన్నాడు.

Latest Updates