వారానికి 26 లక్షలిస్తే సామాన్యుడిలా బతుకుతా: విజయ్ మాల్యా

Vijay Mallya may have to curb his Rs. 26,62,000-a-week London life

లండన్ (బ్రిటన్): ‘‘బ్యాంకుల కోసం నా సర్వసుఖాలను వదులుకుంటా. ఓ సాధారణ వ్యక్తిలా బతుకుతా. దయచేసి వారానికి 29,500 పౌండ్లు (26.62 లక్షల రూపాయలు)ఖర్చు చేసుకునేందుకు అనుమతివ్వండి’అని విజయ్ మాల్యా(63) లండన్ కోర్టును వేడుకున్నారు. అంత ఖర్చు చేసే వీలు ఇవ్వలేమని, వారానికి 18,325.31 పౌండ్లు (-రూ.16.53 లక్షలు) వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు కోర్టు పేర్కొం ది. అంతకుముందు మాల్యాకు అప్పులిచ్చిన13 బ్యాంకుల కన్సార్షియం బుధవారం ‘లగ్జరీ లైఫ్ స్టైల్’పై అభ్యంతరం తెలిపాయి. లండన్ లోని ఐసీఐసీఐ బ్యాంకులో మాల్యా పేరిట ఉన్న 2.60 లక్షల పౌండ్లను తీసుకునే అధికారం కల్పించాలని కోర్టును కోరాయి. రెండు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.

Latest Updates