ఒక్క సీన్… అరవై టేక్స్

కోలీవుడ్​లో అతడొక సంచలనం. ప్రొడ్యూసర్​, స్క్రీన్​ రైటర్​, లిరిసిస్ట్​, ప్లే బ్యాక్​ సింగర్​.. ఒక మనిషిలో ఇన్ని కోణాలుండటం చాలా అరుదు. అన్నింటిలో పరెఫెక్ట్​ అనిపించుకున్న విజయ్​ సేతుపతి నటనలో మాత్రం సంచలనాలు సృష్టిస్తున్నాడు. కొత్త తరహా నటనతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. అలాంటివాడు ఒక్క సీన్ కోసం అరవై టేక్స్ తీసున్నాడట.

‘సూపర్ డీలక్స్’ చిత్రంలో శిల్ప అనే  ట్రాన్స్​జెండర్​ రోల్ చేశాడు సేతుపతి. మొదటి రోజు షూటింగులో చాలా ఇబ్బంది పడ్డాడట. అమ్మాయిలా ప్రవర్తించటం చేతకాక అరవై టేక్స్ వరకు తీసుకున్నాడట. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమ్మాయిలా ఎలా నిలబడాలి, ఎలా నడవాలి అన్నీ నేర్పిస్తే, బాగా ప్రాక్టీస్ చేసి కెమెరా ముందుకొచ్చాడట. అంత కష్టపడ్డాడు కాబట్టే అదరగొట్టేసాడు.

త్యాగరాజన్​ కుమారరాజా​ దర్శకత్వంలో వచ్చిన సూపర్ డీలక్స్ మూవీ బాక్సాఫీస్​ని షేక్​ చేసింది. సేతుపతి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ​ఇప్పుడు ఇండియన్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ ఆఫ్​ మెల్​బోర్న్​ వారు సేతుపతికి ఉత్తమ నటుడి అవార్డు కూడా ఇచ్చారు. దటీజ్ సేతుపతి.

Latest Updates