దుమారం రేపిన విజయ్ కామెంట్స్

తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగులోనూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ సేతుపతి. నిజ జీవితంలో ఎప్పుడూ కూల్​గా వుంటూ, మంచివాడని ప్రశంసలు పొందే సేతుపతి.. ఉన్నట్టుండి ఒక గొడవలో  చిక్కుకున్నాడు.  నాస్తికత్వాన్ని నమ్మే విజయ్ కొన్ని రోజుల క్రితం హిందూ దేవుళ్లపై చేసిన కామెంట్స్  పెద్ద దుమారాన్నే రేపాయి. ఆలయాల్లో విగ్రహాల అభిషేకానికి భక్తులకు అనుమతి ఇస్తున్నారని.. పట్టువస్త్రాలు ధరించేటప్పుడు మాత్రం అనుమతించరని విజయ్ చేసిన కామెంట్లు కాంట్రవర్సీకి కారణమయ్యాయి. విజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ  తిరుచ్చిలో అఖిల భారత హిందూ మహాసభ నిర్వాహకులు ఆయనపై ఫిర్యాదు చేశారు. అలాగే విజయ్ మాటలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ బీజేపీ నాయకులు గోపిచెట్టి పాళయంలోని పోలీస్ స్టేషన్​లో మరో ఫిర్యాదు చేశారు. అయితే ఈ కామెంట్లు తాను చేయడానికి గల కారణాన్ని కూడా విజయ్ సేతుపతి  వివరించాడు. ఇవి తాను సొంతంగా చేసిన కామెంట్స్ కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ కొందరు తీవ్రంగా తప్పుబడుతున్నారు. విజయ్ ఎవరినీ హర్ట్ చేసే టైప్ కాదని, ఎక్కడో పొరపాటు జరిగిందని సేతుపతి గురించి తెలిసినవాళ్ళు చెబుతున్నారు. ఏది ఏమైనా విజయ్ ఈ వివాదాల నుంచి త్వరగా బయటపడితే బాగుంటుందనుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్.

ఇపుడు వెహికిల్ కొంటే 2021 నుంచి ఈఎంఐ

 

Latest Updates