పెళ్లి పీటలెక్కిన టీమిండియా ఆల్‌రౌండర్

Vijay Shankar Marries Vaishali Visweswaran, SunRisers Hyderabad Send Best Wishes

చెన్నై: టీమిండియా ఆల్‌‌రౌండర్ విజయ్ శంకర్ ఓ ఇంటి వాడయ్యాడు. ఫియాన్సీ వైశాలీ విశ్వేశ్వరన్‌‌ను వివాహం చేసుకున్నాడు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సమీప బంధువులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఈ వేడుక జరిగింది. విజయ్‌‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఐపీఎల్‌‌లో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విజయ్ అంటూ విషెస్ తెలియ‌జేసిన స‌న్‌ రైజ‌ర్స్.. ఆరెంజ్ ఆర్మీ అనే ట్యాగ్‌‌ను ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్‌లో హల్‌‌చల్ చేస్తున్నాయి. గతేడాది ఆగస్టు 20న విజయ్ శంకర్ నిశ్చితార్థం జరిగింది.

Latest Updates