విజయ డెయిరీకి అవార్డు.. ఇది నాణ్యతకు గుర్తింపు

vijaya dairy received Award From IFSS

vijaya dairy received Award From IFSSఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్ లో విజయ డెయిరీకి అవార్డు దక్కింది. కేంద్రమంత్రి అశ్వినిచౌబే చేతుల మీదుగా TSDDCF ఎండీ శ్రీనివాసరావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మల్లయ్య అవార్డు అందుకున్నారు. సాంఘీక సంక్షేమ పాఠశాలలకు, అంగన్ వాడీలకు స్వచ్ఛమైన పాలు అందిస్తున్నందుకు గాను విజయ డెయిరీకి ఈ అవార్డు వచ్చింది. ఇది విజయ డెయిరీ సమర్థతకు, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు వచ్చిన గౌరవంగా భావిస్తున్నామన్నారు ఎండీ శ్రీనివాసరావు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతోందన్నారు.

Latest Updates