ఐమాక్స్ లో టికెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ

డిఫరెంట్ స్టైల్ , ట్రెండ్ తగ్గట్టు డ్రెస్సింగ్ తో తనకంటూ ఓ ఇమేజ్ సెట్ చేసుకున్న విజయ్ దేవర కొండ.. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరో.  అభిమానులు ముద్దుగా రౌడీ అని పిలుచుకుంటారు. ఈ రౌడీ ఎక్కడికెళ్లినా అందరినీ అట్రాక్ట్ చేస్తుంటాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తున్న విజయ్ నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా అనే సినిమా నిర్మించాడు.  పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా షమ్మీర్ సుల్తాన్ డైరెక్టర్. అనసూయ, అభినవ్ ముఖ్య పాత్రల్లో నటించారు.  ఈ సినిమా ఇవాళ ( శుక్రవారం) రిలీజ్ అయ్యింది. ఇవాళ ఉదయం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ కు వెళ్లిన విజయ్ అక్కడ అభిమానులతో సందడి చేశాడు. కాసేపు అక్కడ  కౌంటర్లో సినిమా టికెట్లు అమ్ముతూ అందరిని అట్రాక్ట్ చేశాడు. టికెట్లు తీసుకున్న అభిమానులు విజయ్ ను చూసి అరుపులు కేకలతో గోలగోల చేశారు. విజయ్ తో కొందరు అభిమానులు ఫోటోలు దిగి ఆనందం వ్యక్తం చేశారు.

Latest Updates