విజయ్ మంచి మనసు : అమర జవాన్ల కుటుంబాలకు సాయం

అమర జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచాడు సినీ నటుడు విజయ్ దేవరకొండ. అమరవీరుల సంక్షేమ నిధికి ఆయన ఆర్థిక సాయం చేశాడు. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. వాళ్లు మన కుటుంబాలను కాపాడుతున్నారు. జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలబడాలి.. మన సాయంతో వారి ప్రాణాలను భర్తీ చేయలేం. అయినా.. మన వంతుగా ఏదో ఒకటి చేయాలి. అందుకే నేను చేశాను.. అంటు ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ.

విజ‌య్ ని స్పూర్తిగా తీసుకుని కొంద‌రు అభిమానులు CRPFకి విరాళాలు పంపిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఆయ‌న ప్ర‌స్తుతం క్రాంతి మాధ‌వ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

Latest Updates