విజయ పాల రేటు లీటరుకు రూ.3 పెంపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : విజయ డెయిరీ పాల ధర ఒక్కసారిగా లీటరుకు రూ.3 పెరిగింది. 2019 డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 16న టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ లీటరు ధరపై రూ.2 పెంచిన విజయ డెయిరీ, మళ్లీ ఫ్రిబవరి 16నుంచి టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌, స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌, హోల్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ లీటరుపై రూ.3 పెంచేసింది. దీంతో వెన్నశాతం తక్కువగా ఉండే టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ రేటు రూ.44 నుంచి రూ.47 అయింది. విజయ డెయిరీ స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ లీటరు రూ.48 నుంచి రూ.51 కాగా, 6 శాతం వెన్న ఉండే హోల్‌‌‌‌‌‌‌‌ మిల్క్ లీటరు రూ.58 నుంచి రూ.61 అయింది. ప్రైవేటు డెయిరీలు జనవరిలోనే పాల ధరలు పెంచేశాయి. ఆరోక్య డెయిరీ, హెరిటేజ్‌‌‌‌‌‌‌‌, జెర్సీ, దొడ్ల, తిరుమల తదితర ప్రైవేటు డెయిరీల టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ ధరలు లీటరు రూ.48, హోల్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ రూ.62లకు అమ్ముతున్నారు. మస్కతి అత్యధికంగా టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ రూ.56, హోల్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ రూ.80 విక్రయించడం గమనార్హం.

వినియోగదారులపై రూ2.25 కోట్ల భారం..

రాష్ట్రంలో రోజు 36 లక్షల లీటర్ల పాలు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వస్తుండగా విజయ డెయిరీ 2.50లక్షల లీటర్లు వరకు అమ్ముతోంది. విజయ డెయిరీ టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ రోజుకు 2లక్షల లీటర్లు పంపిణీ చేస్తోంది. స్టాండర్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్, హోల్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ కలిపి రోజుకు 50వేల లీటర్లకు పైగా విక్రయిస్తోంది. లీటరుకు రూ.3 పెరగడంతో వినియోగదారులపై రోజుకు ఏడున్నర లక్షల రూపాయలు, నెలకు రూ2.25 కోట్ల భారం పడుతుందని మార్కెట్‌‌‌‌‌‌‌‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టోన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ రూ.47, హోల్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ రూ.61.. వినియోగదారులపై రూ2.25 కోట్ల వరకు భారం

పాలరకం                     ప్యాకింగ్‌‌‌‌‌‌‌‌ పరిమాణం    ప్రస్తుత ధర (రూ.ల్లో)  పెరిగిన ధర

హోల్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌             500 మి.లీ              29.00                  30.50

స్టాండర్డైజ్డ్ మిల్క్‌‌‌‌‌‌‌‌         500 మి.లీ              24.00                  25.50

టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌              1000 మి.లీ            44.00                  47.00

టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌              500 మి.లీ              22.00                  23.50

టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌              200 మి.లీ              9.00                    9.50

టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ బల్క్‌‌‌‌‌‌‌‌        6 లీటర్లు                258.00                 276.00

డబుల్‌‌‌‌‌‌‌‌ టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌      500 మి.లీ              20.00                  21.50

డబుల్‌‌‌‌‌‌‌‌ టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌      300 మి.లీ              12.00                  13.00

డబుల్‌‌‌‌‌‌‌‌ టోన్డ్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌      200 మి.లీ              8.50                    9.00

డైట్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌                500 మి.లీ              19.00                  20.50

ఆవుపాలు               500 మి.లీ              22.00                  23.50

టీ స్పెషల్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌         500 మి.లీ              21.00                  22.50

ఫామిలీ మిల్క్‌‌‌‌‌‌‌‌          500 మి.లీ              21.00                   22.50

Latest Updates