వైసీపీ ప్రచారం‌లోకి వైయస్ విజయమ్మ, షర్మిళ

అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించే లక్ష్యంతో ఎన్నికల ప్రచార వ్యూహాలను రచిస్తోంది వైఎస్ఆర్ సీపీ. అన్ని శక్తులను కూడగట్టి వైసీపీ జెండా ఎగరేసే లక్ష్యంతో ఎన్నికల యుద్ధంలోకి దిగుతోంది. పార్టీ అధ్యక్షుడు జన్మోహన్ రెడ్డితోపాటు.. తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు షర్మిళ వేర్వేరుగా ప్రచారం చేయనున్నారు. విజయమ్మ, షర్మిల ప్రచారానికి వేర్వేరు బస్సులను సిద్ధం చేస్తోంది వైసీపీ.

ఈ నెల 27 నుండి గుంటూరు జిల్లా మంగళగిరి నుండి షర్మిళ బస్సుయాత్ర, రోడ్ షో ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు షర్మిళ ప్రచారం కొనసాగుతుంది. మొత్తం 10 జిల్లాల్లో షర్మిళ ప్రచారం ఉంటుంది. దాదాపు 50 నియోజకవర్గాలలో షర్మిళ రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

40  నియోజకవర్గాల్లో విజయమ్మ ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరో వైపు ప్రతి రోజు 4 నుంచి 5 నియోజకవర్గాలు చుట్టేలా ప్రచారం స్పీడు పెంచనున్నారు వైఎస్ జగన్.

Latest Updates