కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో?: విజయశాంతి

 సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు చేశారు  తెలంగాణ ప్రదేశ్ క్యాంపెయినింగ్ కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ వ్యాప్తంగా తిరిగిన కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారో అర్థం కావడం లేదన్నారు.  ఫెడరల్ ఫ్రంట్ పేరుతో డీఎంకే అధినేత స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమార స్వామీని కలిసిన కేసీఆర్.. ఫ్రంట్  ఏమైందో చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన వల్లే కుమార స్వామి గెలిచారన్న కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి కర్ణాటకకు ఎందుకు వెళ్లలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ మాట ఫెడరల్ ఫ్రంట్ వైపు..మనిషి మాత్రం మోడీ వైపు వెళ్తుందని విమర్శించారు విజయశాంతి.

Latest Updates