మోడీ.. కేసీఆర్ ను ఫాలో అవుతున్నారు : విజయశాంతి

హైదరాబాద్: ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్యాంపెయినింగ్ కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తమ వైపు ఎలా లాక్కోవాలో కేసీఆర్ ను చూసి మోడీ నేర్చుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.  పశ్చిమ బెంగాల్ లో  టీఎంసీ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. మమత ప్రభుత్వం కూలిపోతుందని మోడీ అనడం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. ఈ రాక్షస క్రీడ తెలంగాణలో మొదలై దేశమంతటా మహమ్మారిలా వ్యాపిస్తుందని అన్నారు.

 

Latest Updates