మహిళగా పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ ను సమర్థిస్తున్నాను

దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని సమర్థించారు కాంగ్రెస్ నేత విజయశాంతి. ఎన్ కౌంటర్ పై నిజానిజాలు ఎలా ఉన్న.. ఘోరమైన నేరం చేసిన నలుగురికి తగిన శిక్ష పడిందనేది తన అభిప్రాయమన్నారు. ఒక మహిళగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను, ముఖ్యమంత్రిని సమర్ధిస్తున్నానన్నారు. మానవత్వాన్ని మంటగలిపిన నలుగురి విషయంలో మానవ హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్‌కౌంటర్‌లు జరగడానికి ఆస్కారం లేని విధంగా మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Latest Updates