ఇప్పుడు తత్వం బోధపడిందా.. కేటీఆర్‌‌?: విజయశాంతి

  • ఈ ఐదేండ్లలో మీరు చేసిందేమిటి?
  • కేటీఆర్​ కామెంట్లకు విజయశాంతి కౌంటర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: టీఆర్​ఎస్​ వర్కింగ్ ​ప్రెసిడెంట్​కేటీఆర్​ వ్యవహారం తనదాకా వస్తే తప్ప తత్వం బోధపడదన్నట్లు ఉందని విజయశాంతి అన్నారు. తమతో కలవని వాళ్లను దేశద్రోహులుగా ముద్రవేస్తూ బీజేపీ రాజకీయం చేస్తోందన్న కేటీఆర్‌‌‌‌ కామెంట్లకు ఆమె కౌంటర్ ​ఇచ్చారు. ఐదేండ్లలో టీఆర్‌‌‌‌ఎస్‌‌ చేసిందేంటని నిలదీశారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌తో కలిస్తే తెలంగాణవాదులు.. లేదంటే వ్యతిరేకులుగా ముద్ర వేయలేదా? అని ఫైర్ ​అయ్యారు. బీజేపీ పట్ల కేటీఆర్ కు కలిగిన అభిప్రాయమే.. టీఆర్‌‌‌‌ఎస్‌‌పై ప్రతిపక్షాలకు కలిగిందన్నారు. అదే అంతర్మథనంతో ప్రతిపక్షాలు కొట్టుమిట్టాడుతున్నా యన్నారు. ఇప్పటికైనా టీఆర్‌‌‌‌ఎస్‌‌ హైక మాండ్​కు తత్వం బోధ పడినందుకు సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనైనా టీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలు వైఖరి మార్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

Latest Updates