మిస్ అండర్‌‌స్టాండింగ్స్ అన్నీ పోయి మళ్లీ  క్లోజయ్యాం

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుక ద్వారా చిరంజీవి గారికి నాకు మధ్య ఉన్న కన్ఫ్యూజన్స్  క్లియరైపోయాయి. చిరంజీవి గారు ఓపెన్‌గా మాట్లాడటంతో మిస్ అండర్‌‌స్టాండింగ్స్ అన్నీ పోయి మళ్లీ  క్లోజయ్యాం. నటిగా కంటిన్యూ అవడానికి నేను సిద్ధం. సంవత్సరానికి ఒకట్రెండు వచ్చినా  బెస్ట్ సినిమాలే ఒప్పుకుంటాను. రెగ్యులర్ పాత్రల్లో కాకుండా పవర్‌‌ఫుల్ పాత్రల్లోనే నటిస్తాను. ప్రేక్షకులు కూడా నా దగ్గర్నుంచి కొత్తదనం కోరుకుంటారు. మనసు శుభ్రంగా, నిర్మలంగా ఉంటుంది కాబట్టి నా గ్లామర్ కూడా అలాగే ఉంటుంది. 

  • మళ్లీ నటించమంటూ చాలా సంవత్సరాల నుంచి దర్శకులు అడుగుతూనే ఉన్నారు. కానీ రాజకీయాల్లో మునిగిపోవడంతో నటించాలనే ఆలోచన రాలేదు. సినిమా అంటే చాలా టైమ్ కేటాయించాలి. నావల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదు. అందుకే వచ్చిన అవకాశాలన్నింటికీ నో చెప్పేదాన్ని.
  • అనిల్ రావిపూడి ఏడాది  క్రితం తన సినిమాలో నటించాలని కోరారు. నో చెప్పాను. మళ్లీ ‘సరిలేరు నీకెవ్వరు’ స్టోరీతో వచ్చి వినమని రిక్వెస్ట్​ చేశారు. కాస్త ఫ్రీగా ఉండటంతో  విన్నాను. బాగా నచ్చింది. మహేశ్ బాబుతో అనేసరికి ఓకే అన్నాను. తనతో నటించడం చాలా కంఫర్ట్‌‌గా అనిపించింది.
  • అనేక సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి సేవలందించాను. గొప్ప గొప్ప సినిమాల్లో నటించాను. హీరోయిన్‌‌గా నలభయ్యేళ్లు నిలబడటమంటే అంత ఈజీ కాదు. ప్రేక్షకులు చాలా ఆదరించారు. ఎప్పుడు ఏం చేయాలో దేవుడు ముందే నిర్ణయిస్తాడు. నిష్క్రమించడం, రీ ఎంట్రీ ఇవ్వడం ఆ దేవుడి నిర్ణయాలే.
  • మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాననే తృప్తి ఉంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌‌ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు బాగా కనెక్టయ్యింది. అభినందనలు వస్తూనే ఉన్నాయి. మళ్లీ వచ్చి మమ్మల్ని ఏడిపించావమ్మా అంటున్నారు. భారతి క్యారెక్టర్‌‌‌‌ని ఆ విధంగా డిజైన్ చేసిన అనిల్‌‌కి కృతజ్ఞతలు. ‘కొడుకు దిద్దిన కాపురం’ తర్వాతఇన్నాళ్లకి మహేశ్​తో నటించా. తను చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. అందరితో సరదాగా ఉంటారు. కృష్ణగారి కుటుంబానికి నాకు ఏదో అనుబంధం ఉన్నట్టు ఉంది. ఆయనతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు మహేశ్‌‌తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది.
  •  నా పాత్రకి ఇంత గొప్ప పేరు రావడానికి అనిల్ గారే కారణం. మంచి పాత్రలకు కరెక్ట్ ఆర్టిస్టులు పడితే బౌండరీలు దాటి సిక్సర్లు వెళ్తాయి . ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెట్‌‌లో అందరూ సరదాగా ఉండేవారు. చాలా రోజుల తర్వాత నవ్వుతూ గడిపాను. రాజకీయాల్లో ఎప్పుడూ టెన్షన్స్..  విమర్శలు, ప్రతి విమర్శలే కదా.
  • అనిల్ రావిపూడి సినిమాలన్నీ చూశాను. ‘పటాస్’ నాకు బాగా నచ్చిన సినిమా. ఇదేమో పవర్‌‌‌‌ఫుల్ స్టోరీ. ఎలా మేనేజ్ చేస్తారో అనుకున్నాం. కానీ అనిల్ అద్భుతంగా చిత్రీకరించారు. కర్తవ్యం, ప్రతిఘటన, రాములమ్మ లాంటి కథ ఉంటే అనిల్​తో మళ్లీ పని చేస్తాను. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తను తీయగలరు.
  •  నా నలభయ్యేళ్ల కెరీర్‌‌‌‌లో దాదాపు అరవై మంది హీరోలతో నటించాను. అరవై ఒకటవ హీరోగా నన్ను కూడా చెప్పుకోవచ్చు. విజయశాంతి స్ఫూర్తితో అనేక మంది మహిళలు పోలీసులయ్యారు. కొంతమంది మహిళా పోలీసులు జూనియర్ విజయశాంతి అని పేరుపెట్టుకున్నారు. జీవితంలో నేను ఈ స్థాయికి వెళ్తానని ఎప్పుడూ ఊహించలేదు.  దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఇది. ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ప్రజలు బాగుండాలని మొదట కోరుకుంటాను.

Latest Updates