సర్జికల్ స్ట్రయిక్ అంటే ఎందుకు ఆగమాగం అయితున్నరు?

ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలకు విజయశాంతి మద్దతు పలికారు. సర్జికల్ స్ట్రైక్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎం ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాయని అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే చేసిందని… పాతబస్తీలో ఆ విధంగా ఎవరూ లేరని… సీఎం కేసీఆర్   తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వచ్చు కదా..? అని అన్నారు.

లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే భయాందోళనలకు టీఆరెస్ గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశం ఉందని విజయశాంతి  వ్యాఖ్యానించారు.

Latest Updates