అక్రమ సంబంధం భయటపడుతుందని కూతుర్ని హత్య చేయించిన తల్లి

తనకు ఎంత కష్టం వచ్చినా ఫర్లేదు. పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది తల్లి. కానీ ఓ తల్లి మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా తన కూతుర్ని చంపేలా ప్రియుడ్ని ప్రేరేపించింది. కృష్ణా జిల్లా విజయవాడ గొల్లపూడిలో దారుణం జరిగింది. అనిల్, వెంకటరమణ భార్య భర్తలు. అనిల్ మద్యం సరఫరా గోదాంలో కూలిగా పనిచేస్తుండగా..వెంకటరమణ స్థానికంగా ఉండే కాలేజీలో స్వీపర్ గా పనిచేస్తుంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమారుల్ని ప్రైవేట్ హాస్టల్ లో ఉండి చదవిస్తున్న అనిల్..కూతురు ద్వారకను స్థానికంగా ఉండే స్కూల్లో చదివిస్తున్నాడు.

అయితే అనిల్ ఇంటి పక్కనే పెంటయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో టీవీ చూసేందుకు ద్వారాక పెంటయ్య ఇంటికి వెళ్లింది. అదే సమయంలో పెంటయ్య, వెంకటరమణలు సన్నిహితంగా ఉండడాన్ని ద్వారాక గమనించింది. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని తల్లిని హెచ్చరించింది. దీంతో భయాందోళనకు గురైన వెంకటరమణ నువ్వే ఏదో ఒకటి చేయి..మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం భయట పడకూడదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో నిందితుడు పెంటయ్య ద్వారకను హత్య చేసి ఇంట్లో దాచిపెట్టాడు.

ఎప్పటి లాగే అనిల్ ఇంటికి వచ్చి కూతురు గురించి ఆరా తీశాడు. ఏం ఎరుగనట్లు ఆడుకోవడానికి భయటకి వెళ్లి ఉంటుందిలే అని వెంకటరమరణ చెప్పింది. చీకటి పడుతుండడంతో భయాందోళనకు గురైన తండ్రి అనిల్.. కూతురి ఆచూకి కోసం గ్రామస్థుల సాయంతో ఊరంతా వెదికాడు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. అదే సమయంలో పుట్టింటి నుంచి  ఇంటికి వచ్చిన పెంటయ్య భార్య కూడా ద్వారక కోసం వెతుకులాడింది. ఎంత వెదుకులాడినా ద్వారాక ఆచూకీ లభించలేదు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న చాపను పక్కకు జరపడంతో మూటలో ఉన్న ద్వారాక మృతదేహం లభ్యమైంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో పెంటయ్య, వెంకట రమణల మధ్య ఉన్న అక్రమ సంబంధం భయటపడుతుందనే ఉద్దేశంతో హత్యచేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

Latest Updates