విజయవాడ దుర్గా ఘాట్ లో కృష్ణా నది హారతులు పునః ప్రారంభం

విజయవాడ: దుర్గాఘాట్‌లో కృష్ణ‌మ్మ‌కు న‌దీ హార‌తులు పునఃప్రారంభం అయ్యాయి. సంప్రదాయ బద్దంగా రుత్వికులు కృష్ణాన‌దికి హార‌తులు స‌మ‌ర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నది హారతులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి పాల‌క‌ మండ‌లి ఛైర్మ‌న్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్‌బాబు  హాజరై కృష్ణా నదికి హారతులు సమర్పించారు. ఇక‌పై ప్ర‌తిరోజూ సాయంత్రం 630 గంట‌ల‌కు కృష్ణ‌మ్మ‌కు హార‌తులు కార్య‌క్ర‌మం కొనసాగించాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో భక్తులను  ప‌రిమిత సంఖ్య‌లోనే అనుమ‌తించాలని అధికారులు నిర్ణయించారు.

 

 

Latest Updates