అగ్ని ప్ర‌మాద మృతుల‌కు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన కేంద్రం

విజయవాడలోని స్వ‌ర్ణ ప్యాలెస్ కరోనా చికిత్స కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, గాయ‌ప‌డిన వారికి రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్లు పీఎంఓ ఆదివారం సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది‌.ఈ ఘటన గురించి తెలియ‌గానే ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్ర‌ధాని మోడీ వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల‌కు అన్ని విధాలా తోడుగా ఉంటామ‌ని తెలిపారు. ఈ ప్రమాదం‌లో చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వం రూ.50 ల‌క్ష‌లు ఆర్థిక సాయం ప్ర‌క‌టించింది.

Latest Updates