ప్రెస్ మీట్ పెడతానన్నవర్మ..అడ్డుకున్నపోలీసులు

విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద  ప్రెస్ మీట్ పెడతానన్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు అడ్డుకున్నారు.  హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న వర్మను అక్కడే అడ్డుకున్నారు. నడి రోడ్డుపై  ప్రెస్ మీట్ పెడితే శాంతి భద్రతల సమస్యలు వస్తాయని పోలీసులు చెప్పారు. అయితే  వర్మ వినకపోవడంతో  ఎస్కార్ట్ వాహనంలో వర్మను ఎయిర్ పోర్టుకు వెనక్కి పంపించారు పోలీసులు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ మే 1 న ఏపీలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్  కోసం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ప్రెస్ మీట్  పెట్టడానికి వర్మకు  హోటల్ యాజమాన్యం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ లో నడి రోడ్డుపై వర్మ ప్రెస్ మీట్ పెడతానని చెప్పాడు.

Latest Updates