పలాస డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ!

‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాతో బిజీ అయిన విజయ్ దేవరకొండ… కొత్తగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘పలాస 1978’ చిత్ర దర్శకుడితో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. క్లిష్టమైన కథను అద్భుతంగా తెరకెక్కించాడని, తొలి చిత్రంతోనే దర్శకుడిగా మెప్పించాడన్న ప్రశంసలు అందుకున్నాడు కరుణ కుమార్. పైగా సినిమా రిలీజ్‌‌కు ముందే గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌లో నెక్స్ట్ మూవీకి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. దీంతో విజయ్‌‌తో చేయబోయే సినిమా గీతా ఆర్ట్స్​లో ఉండనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే క్రేజ్ ఉన్న హీరో, పేరు తెచ్చుకున్న డైరెక్టర్ కాంబినేషన్స్​లో సినిమా ఉంటుందనే ప్రచారం. గతంలో విజయ్ సినిమా విషయంలో సుకుమార్ మొదలు మారుతి, బాబి, హను రాఘవపూడి, వెంకీ అట్లూరితో సహా పలువురు దర్శకుల పేర్లు ఇలాగే వినిపించాయి. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. నెక్స్ట్ మూవీ శివ నిర్వాణతో చేయబోతున్నట్టు డిసెంబర్‌‌‌‌లో ట్వీట్ చేశాడు విజయ్. దిల్ రాజు ఆ సినిమాకు నిర్మాత. ‘పలాస’ డైరెక్టర్‌‌‌‌తో సినిమా కూడా నిజమే అయితే విజయ్ వైపు నుండే ఆ వార్త వినొచ్చేమో!

Latest Updates