దుమ్మురేపుతున్న ‘మాస్టర్’ టీజర్.. యూట్యూబ్‌‌లో కొత్త రికార్డు

చెన్నై: తమిళ అగ్ర నటుడు, అభిమానులు ముద్దుగా దళపతి అని పిల్చుకునే విజయ్ కొత్త మూవీ మాస్టర్ టీజర్ రీసెంట్‌‌గా రిలీజైంది. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్‌‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఈ వీడియోకు 23 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా.. 2 మిలియన్ల లైకులు రావడం విశేషం. యూట్యూబ్‌‌లో 2 మిలియన్ లైక్స్ సంపాదించిన తొలి ఇండియా మూవీగా మాస్టర్ రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు విజయ్ నటించిన సర్కార్ టీజర్‌‌తో ఉండేది. విజయ్ తన రికార్డును తానే అధిగమించాడు.

Latest Updates