దుబాయ్‌ పోరుకు విజేందర్‌ సింగ్‌

భారత  స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ మరో పోటీకి రెడీ అయ్యాడు. 11 వరుస బౌట్‌ విజయాలతో తిరుగులేని ఫామ్‌లో ఉన్న విజేందర్… ఘనా బాక్సర్‌ చార్లెస్‌ అడామును ఈ నెల 22న దుబాయ్‌ లో జరిగే పోటీలో ఢీకొననున్నాడు. కామన్వెల్త్‌ మాజీ చాంపియన్‌ అయిన చార్లెస్‌ను ఓడించి 12వ విజయాన్ని నమోదు చేసేందుకు భారత బాక్సర్‌ సిద్ధమయ్యాడు. ఈ ఏడాది జులైలో తొలిసారిగా అమెరికా బౌట్‌లో అడుగు పెట్టిన విజేందర్‌సింగ్‌..మైక్‌ స్నైడర్‌ను చిత్తుగా ఓడించాడు. 2020లో ప్రపంచ బాక్సింగ్‌ టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

మరోవైపు ఘనా బాక్సర్‌ చార్లెస్‌ రికార్డు కూడా ఘనంగానే ఉంది.

 

Latest Updates