హ్యాట్సాఫ్ కలెక్టరమ్మ : తన పిల్లలను మైనారిటీ గురుకుల స్కూల్లో చేర్చింది

vikarabad-collector-childrens-govt-schools-join

వికారాబాద్ కలెక్టర్ అయేషా మస్రత్ ఖనమ్ ఆదర్శంగా నిలిచారు. తన పిల్లలను మైనారిటీ గురుకుల స్కూల్ లో చేర్పించారు. ఇంతకుముందు కూడా ఆమె మంథని ఆర్డీవోగా ఉన్న సమయంలో తన పిల్లలను అంగన్వాడీ స్కూల్ కు పంపేవారు. ర్యాంకులు, మంచి ఎడ్యుకేషన్ కోసం ప్రైవేట్ స్కూల్స్ కు పంపే ఈ రోజుల్లో ..ఓ కలెక్టర్ అయి ఉండి కూడా ప్రభుత్వ గురుకుల స్కూల్లో తన పిల్లలను చదివించడంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హ్యాట్సాఫ్ కలెక్టరమ్మ అంటూ కితాబిస్తున్నారు జిల్లా ప్రజలు.

Latest Updates