నాచారం  దగ్గర క్షుద్రపూజలు  కలకలం

V6 Velugu Posted on Dec 02, 2021

వికారాబాద్ జిల్లా:  దోమ మండలం  ఖమ్మం నాచారం  దగ్గర క్షుద్రపూజలు  కలకలం సృష్టించాయి.. స్థానికంగా  ఉన్న అటవీ ప్రాంతంలో  పశువుల మేతకు  వెళ్ళిన స్థానికులు... ఈ క్షుద్రపూజల అనవాళ్ళను గుర్తించారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ముగ్గులు వేసి  అందులో గుమ్మడి కాయలు, నిమ్మకాయలు, పసుపు కుంకుమ, ఉడికించిన కందులు ఉన్నాయి. వాటితోపాటు కుండలో కల్లు, మేక తలకాయ, కాల్చిన గుడ్డలు ఉన్నాయి. వీటన్నింటినీ  చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు  ఫిర్యాదు చేశారు  గ్రామస్తులు. స్పాట్ కి  చెరుకుని  దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.   ఈ ప్రాంతం అసాంఘిక  కార్యకలాపాలకు  అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.

Tagged Vikarabad, , suchi mrgs

Latest Videos

Subscribe Now

More News