నన్ను పెళ్లి చేసుకో.. లేకపోతే చంపుతా: వివాహితపై యువకుడి వేధింపులు

వికారాబాద్,వెలుగు: వివాహితను వేధింపులకు గురిచేసిన యువకుడిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్టు జిల్లా ఎస్పీ నారాయణ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహ్మద్ సల్మా(27) వికారాబాద్ లోని రామయ్యగూడ కాలనీలో ఉంటున్నాడు. సల్మా ఏడు నెలలుగా తనను పెళ్లిచేసుకోవాలని ఓ వివాహితను వేధిస్తున్నాడు. లేకపోతే చంపుతానని బెదిరించాడు. గతంలో సల్మాపై ఆమె పీఎస్‌లో కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి జైలుకి తరలించారు.

బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత మళ్లీ  వివాహితను వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను బెదిరించడంతో పాటు 3 సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది. వికారాబాద్ పోలీసులు సల్మాను అదుపులోకి తీసుకున్నారు. సల్మా ఇతరులపై దాడి చేసినందుకు గతంలో 3 కేసులు నమోదయ్యాయని.. ఇటీవల అతడిపై మరో 3 కేసులు ఫైల్ అయ్యాయని వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు తెలిపారు. సల్మా తీరు మారకపోవడంతో పీడీ యాక్ట్ నమోదుచేసి సెంట్రల్ జైలుకి తరలించినట్టు చెప్పారు.

Latest Updates