సంద్రంలో రాకాసి అలలు:  ఊగిపోయిన వైకింగ్ స్కై క్రూయిజ్

లగ్జరీ వసతులతో కూడిన క్రూయిజ్ షిప్ .. ఆడుతూపాడుతూ సాగుతోందా ప్రయాణం.. సుమారు1 ,300 మంది టూరిస్టులు, సిబ్బంది ఉన్నారు.అంతా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు.. కానీఒక్కసారిగా పెద్ద శబ్దం .. నౌక మొత్తం ఊగిపోయింది.. షిప్ లోని రెస్టారెంట్ లో భోజనం చేస్తున్న వారిప్లేట్లు జారిపోయాయి.. నిలబడ్డ వారంతా కిందపడిపోయారు.. ఏం జరుగుతోందోనని అందరిలోభయం.. సముద్రంలో ఉన్న ఆ క్రూయిజ్ షిప్ పైరాకాసి అలలు విరుచుకుపడ్డాయి. క్రూయిజ్ అతలాకుతలమైంది. ఓ వైపుకు ఒరిగింది. అద్దాలు పగిలిపోయాయి. సామానంతా చెల్లాచెదురైంది. నీళ్లు కొద్దికొద్దిగా లోపలికి రావడం మొదలుపెట్టాయి. ఇంజిన్ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కావడంలేదు. మరోవైపు ప్రచండ గాలులు కుదిపేస్తున్నాయి.నౌకను తీరంలో ఉన్న రాళ్ల గుట్ట వైపు నెట్టేస్తున్నాయి.క్రూయిజ్ దాన్ని తాకుంటే టైటానిక్ లాంటి విషాదంజరిగి ఉండేది. కానీ క్రూయిజ్ కెప్టెన్ చాకచక్యంగాలంగర్ వేశారు. దీంతో క్రూయిజ్ ఎక్కువ దూరంకదల్లేదు. ఈలోగా ఇంజిన్ స్టార్టయింది. కానీసముద్ర ఉధృతి మాత్రం తగ్గలేదు. నౌక కెప్టెన్ నుంచిసమాచారం అందుకున్న నార్వే కోస్ట్‌‌ గార్డు వాళ్లందరినీ కాపాడింది.అయితే రెస్క్యూకు దాదాపుగా 20 గంటల సమయంపట్టింది. దీంతో ఏ క్షణం ఏమవుతుందో తెలీక టూరిస్టులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దాదాపు 24 అడుగులఎత్తు ఎగసిన అలలు క్రూయిజ్ ను ఢీ కొడుతుంటేబెంబేలెత్తిపోయారు.

ఐదు హెలికాప్టర్ లు గ్రూపులుగా నలుగురు నలుగురిని తరలిస్తుంటే, లైఫ్ జాకెట్లువేసుకుని తమ వంతు కోసం ప్రాణాలు అరచేత పెట్టుకుని ఎదురుచూశారు. కొందరిని లైఫ్ బోట్లలో తీసుకెళ్లారు. ఇలా దాదాపు 500 మందిని తరలించాక,సముద్రం శాంతించింది. దీంతో రక్షణ సిబ్బంది ఆదివారం సాయంత్రం క్రూయిజ్ ను మరో నౌకసాయంతో జాగ్రత్తగా మోల్డే నగర సముద్రతీరానికి లాక్కెళ్లారు. అలల తాకిడికి 8 మంది టూరిస్టులుతీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో ముగ్గురి పరిస్థితివిషమంగా ఉంది. మిగతా వాళ్లను స్థానికంగా ఉన్నస్పోర్స్ట్ కాంప్లె క్స్ కు తరలించారు. క్రూయిజ్ లోఉన్న వాళ్లలో అత్యధికులు అమెరికా, బ్రిటన్‌‌ పౌరులే.సముద్ర దళం క్రూయిజ్ లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న టైంలో, దానికి కూతవేటు దూరంలో ఓ కార్గోషిప్ అలలు ధాటికి ఓ వైపు ఒరిగిపోయింది. దీంతోఆపరేషన్ లోని రెండు హెలికాప్టర్లను, ఆ నౌకలోనివారిని రక్షించేందుకు పంపారు. మరో రెండునిమిషాలు ఆలస్యమైతే, నౌక మునిగి చనిపోయే వాళ్లమని టూరిస్టుల్లో ఒకరు పేర్కొన్నారు.

14 రోజుల టూర్
నార్వేలోని బెర్గెన్ సిటీ నుంచి ఇంగ్లండ్ లోని లండన్వరకూ ‘వైకింగ్ స్కై క్రూయిజ్’ విహారయాత్రకువెళ్తుంది. 47 వేల టన్నులకుపైగా బరువుండే ఈనౌకలో 1400 మంది పడతారు. 14 రోజుల పాటుసాగే ఈ ట్రిప్ లో నార్విక్, అల్టా, ట్రోమ్సో, బొడో, స్టావెంజర్ నగరాల మీదుగా లండన్ కు చేరుకుంటుంది.మరో మూడు రోజుల్లో ట్రిప్ పూర్తవుతుందనగా హుస్తాద్వికా వద్ద ఈ కల్లోలం చోటు చేసుకుంది. నార్వేతీరంలోని అత్యంత ప్రమాదకరమైన సముద్ర ప్రాంతాల్లో ఇదొకటి. 2017లో ‘వైకింగ్ ఓషన్ క్రూయిజెస్’అనే టూరిస్టు ఆపరేటర్ ఈ నౌకను లాంచ్ చేసింది

Latest Updates