చంద్రుడికి మరో 35 కిలోమీటర్ల దూరంలో విక్రమ్

చంద్రుడికి మరింత దగ్గరగా వెళ్లింది విక్రమ్​. జస్ట్​ 35 కిలోమీటర్ల ఎత్తులో మామ కోసం చక్కర్లు కొడుతోంది. బుధవారం రెండో సారి విక్రమ్​ను కక్ష్య నుంచి తప్పించే మిషన్​ను చేసింది ఇస్రో. తెల్లవారుజామున 3.42 గంటలకు 9 సెకన్ల పాటు విక్రమ్​ ఇంజన్లను మండించి 35 (కక్ష్య ఎత్తు)X101 (కక్ష్య దూరం) కక్ష్యలోకి చేర్చింది. ప్రస్తుతం ఆర్బిటర్​ 96X125 కక్ష్యలో తిరుగుతోంది. విక్రమ్​, ఆర్బిటర్​ పనితీరు మెరుగ్గా ఉన్నట్టు ఇస్రో తెలిపింది. ఇక, మిగిలి ఉంది ల్యాండింగే. అందు కోసం చిన్నచిన్నగా విక్రమ్​ను కిందకు తీసుకొస్తారు. సెప్టెంబర్​ 7న అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్య ల్యాండింగ్​ పని మొదలు పెడతారు. మంచి స్పాట్​ చూసుకుని 2.30 గంటలకు చందమామపై విక్రమ్​ను దింపుతారు. కాగా, విక్రమ్​ ల్యాండింగ్​ను లైవ్​లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చూసేందుకు దేశవ్యాప్తంగా 70 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఇస్రో నిర్వహించిన ఆన్​లైన్​ క్విజ్​లో ఒక్కో రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నుంచి టాప్​ 2లో నిలిచిన 8 నుంచి పదో తరగతి స్టూడెంట్లను అందుకోసం ఎంపిక చేశారు. మొత్తంగా 70 మందిని ఎంపిక చేసినట్టు ఇస్రో అధికారి తెలిపారు. చంద్రయాన్​ 2 ప్రయోగంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకుగానూ MyGov.in సహకారంతో ఆగస్టు 10 నుంచి 25 వరకు ఇస్రో ఆన్​లైన్​ క్విజ్​ నిర్వహించింది.

Latest Updates