కోహ్లీ ఆటను మార్చేసుకుంటాడు: రాథోర్

పరిస్థితులకు తగ్గట్టుగా ఆట తీరును మార్చుకోవడంలో విరాట్ కోహ్లీ దిట్ట అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అన్నాడు. నిజాయితీగా ఆడాలనే కమిట్‌‌‌‌మెంటే అతని సక్సెస్ కు కారణమన్నాడు. ‘కోహ్లీలో నాకు నచ్చిన అంశం ఆటపై అతనికి ఉన్న కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌. వరల్డ్ ‌‌‌లోనే బెస్ట్ ‌‌‌ప్లేయర్‌‌‌‌గా ఉండాలని ఎప్పుడూ అనుకుంటాడు. దీనికోసం ఇంతలా కష్టపడే క్రికెటర్‌‌‌‌ను నేనెప్పుడూ చూడలేదు. వీటన్నింటికి తోడు పరిస్థితులను తనకు అనువుగా మల్చుకోవడం అతని స్ట్రెంత్. అవసరమైనప్పుడు ఆట స్వరూపాన్నేమార్చేస్తుంటాడు. ఇందుకోసం తన ఆట తీరునే మార్చేసుకుంటాడు. ప్రతి ఫార్మాట్లో డిఫరెంట్గా ఆడతాడు ’ అని రాథోర్ వివరించాడు. 2016 ఐపీఎల్లో కోహ్లీ ఆడిన ఆటే ఇందుకు ఉదాహరణ అని చెప్పాడు. ఆ టోర్నీలో నాలుగు సెంచరీలు చేసిన కోహ్లీ, 40 సిక్సర్లు కొట్టాడని రాథోర్ చెప్పుకొచ్చాడు.