రెండేళ్ల పిల్లాడికి 102 ఏళ్లు.. నాలుగేళ్ల పిల్లాడికి 104 ఏళ్లు

ఆఫీసర్ల నిర్వాకం

ఓ పిల్లాడికి రెండేళ్లు.. కానీ ఆ చిన్నారి బర్త్​సర్టిఫికెట్ ప్రకారం 102 ఏళ్లు. మరో పిల్లాడికి నాలుగేళ్లు.. కానీ అతడి బర్త్​సర్టిఫికెట్ ప్రకారం 104 ఏళ్లు. ఈ వింత ఉత్తర్ ప్రదేశ్​లో జరిగింది. బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు లంచం అడగ్గా, ఇవ్వకపోవడంతో ఆఫీసర్లే ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారు. షాజహన్​పూర్ ఖుతార్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బేలా ఊరిలో ఈ సంఘటన జరిగింది. పవన్​కుమార్​అనే వ్యక్తి తన ఇద్దరు మేనల్లుళ్లు సుభ్(2), సంకేత్(4)లకు బర్త్ సర్టిఫికెట్ కోసం2 నెలల క్రితం ఆన్​లైన్​లో అప్లై చేశాడు. అయితే, ఒక్కో సర్టిఫికెట్‌‌కు రూ.500 లంచం ఇవ్వాలని విలేజ్​ డెవలప్​మెంట్ ఆఫీసర్ ​సుశీల్​చంద్​ అగ్నిహోత్రి, విలేజ్ హెడ్​ ప్రవీణ్​మిశ్రా డిమాండ్​ చేశారు. పవన్‌‌ లంచం ఇవ్వకపోవడంతో పుట్టిన తేదీలను 2018 జనవరి 6కు గాను 1918 జనవరి 6 (సుఖ్‌‌)గా, 2016 జూన్ 13కు గాను 1916 జూన్​13 (సంకేత్‌‌)గా వేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

Latest Updates