చేపల చెరువు లూటీ..

village-people-looted-fishes-in-mahabubabad-river

మహబూబాబాద్ జిల్లాలో ఓ చేపల చెరువు లూటీకి గురైంది. చెరువు దగ్గరకు వచ్చిన వేలాది గ్రామస్తులు చెరువులో ఉన్న చేపలను  పట్టుకుపోయారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపల్లి గ్రామంలోని పెద్ద చెరువులో మత్స్యకారులు చేపలు పడుతుండగా… అక్కడికి  తరలివచ్చిన వేలాది గ్రామస్తులు చేపలను పట్టుకోవడానికి చూశారు. దీంతో మత్స్యకారులకు గ్రామస్తులకు ఘర్షన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని శాంతింప చేయాలని చూశారు. పోలీసుల మాటలను గ్రామస్థులు పట్టించుకోకుండా తోసుకుంటూ వెళ్లి చేపలను పట్టుకున్నారు. వేలాదిగా వచ్చిన గ్రామస్తులను పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా  చేపల పెంపకం చేపట్టింది. లక్షలాది పిల్ల చేపలను చెరువులో వొదిలింది. అవి పెద్దవయ్యాక మత్స్యకారులు పట్టుకుని అమ్ముకుంటున్నారు. ఇందులో భాగంగా.. కాంపల్లి గ్రామంలోని చెరువులో పెద్దవయిన చేపలను మత్స్యకారులు పట్టుకుంటుండగా.. అదే గ్రామానికి చెందిన ప్రజలు, మత్స్యకారులపై దాడిచేసి చేపలను పట్టుకుపోయారు. దీంతో  లక్షల రూపాయలు లాస్ అయినట్టు  మత్స్యకారులు మీడియాకు తెలుపుతూ విలపించారు.  మత్స్యకారులకు మృగశిర కార్తి వరకే చేపలపై హక్కు వుంటుందని… ఆ తర్వాత చేపలను ఎవరైనా పట్టుకోవచ్చని స్థానికులు తెలపడం గమనార్హం.

Latest Updates