వాగులో బయటపడ్డ విలేజ్ సెక్రటరీ మృతదేహం

పని ఒత్తిడితో ఆత్మహత్య?

ఆసిఫాబాద్, వెలుగు: అనుమానాస్పద స్థితిలో విలేజ్ సెక్రటరీ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ టౌన్‌కు చెందిన అలీబాబా(42) తిర్యాణి మండలం మంగి పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నాడు. శుక్రవారం డ్యూటీకి వెళ్తున్నానని భార్య రుకియా బేగంకి చెప్పి మోటార్ సైకిల్ మీద వెళ్లాడు. సాయంత్రం వట్టివాగు ప్రాజెక్టు కట్ట మీద అలీబాబా మోటార్ సైకిల్, సెల్ ఫోన్ గుర్తించిన పోలీసులు చిరునామా ఆధారంగా భార్య, కుటుంబీకులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని చూసినా అలీబాబా ఆచూకీ దొరకలేదు. శనివారం ఉదయం వాట్టివాగు ప్రాజెక్టులో శవం బయటపడింది. పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. తన భర్త మృతి మీద అనుమానాలు ఉన్నాయని రుకియా బేగం పేర్కొంది. ఆఫీసర్ల వేధింపులు, పని ఒత్తిడి కూడా ఉందని, దీనిపై పూర్తి విచారణ చేయాలని ఇచ్చిన పిటిషన్‌తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు.

For More News..

3 గంటల్లో 30 పేపర్లు దిద్దిస్తున్రు

కాంగ్రెస్సే అతిపెద్ద కరోనా

Latest Updates