ఆ గ్రామంలో పిల్లల్ని కనరాదు..శవాలను పూడ్చరాదు

లేటెస్ట్ టెక్నాలజీతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ అభివృద్ధిలో దూస్కెళ్తుంటే…మరోవైపు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. వీటికి ప్రజలను బలవుతూనే ఉన్నారు. సౌతాఫ్రికాలోని దక్షిణ ఘనాలో ఉన్న మాఫీ డవ్ అనే గ్రామంలో ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఆ ఆచారం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య కలిగిస్తోంది. ఈ గ్రామంలో మహిళలు ప్రసవించరాదు.. చనిపోయిన వారిని పాతిపెట్టరాదు. ఇదే ఈ గ్రామ వింత ఆచారం. పైగా అనాదిగా వస్తున్న ఇలాంటి ఆచారాన్ని ఆ గ్రామస్తులు ఎవరూ కూడా వ్యతిరేకించడం లేదు కూడా.

మాఫీ డవ్ గ్రామంలో దాదాపుగా 5 వేల మంది జనాభా ఉంటుంది. వీరంతా ఈ గ్రామ గడ్డపై పుట్టినవారు కాదు. ఆ గ్రామానికి చెందిన మహిళలు గర్భందాల్చవచ్చు. డెలివరీ మాత్రం గ్రామంలో జరగటానికి వీల్లేదు. అంటే డెలివరీకి కొన్ని నెలల ముందే వారు వేరే గ్రామాలకు వెళ్లిపోతారు. అక్కడే బిడ్డను కని, బిడ్డ బొడ్డు తాడు ఊడిన తర్వాత మాత్రమే తిరిగి గ్రామానికి రావాలి. ఇక ఎవరైనా చనిపోయినట్లయితే.. వారిని ఆ గ్రామంలో పాతిపెట్టరు. ఖననం చేయరు. పక్క గ్రామాలకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేస్తారు.

అంతేకాదు మాఫీ డౌవ్‌లో ఎవ్వరూ జంతువుల్ని పెంచుకోరాదు. అలాగని వారు మాంసం తినకుండా ఉండరు. జంతువుల్ని గ్రామానికి తీసుకొస్తారు. అలా గ్రామానికి తీసుకొచ్చిన రోజే దాన్ని వధించి తినేస్తారు. ఒక్క రోజు ఎక్కువ ఉంచినా ఆ గ్రామ కట్టుబాట్లను అతిక్రమించినట్లే.

అయితే ఈ గ్రామస్తులు ఈ తరహా ఆచారాన్ని పాటించడానికి ఓ బలమైన కారణం లేకపోలేదు. టాగ్బే గబెవొఫియా అకిటీ అనే వేటగాడు మొదటిసారిగా ఈ గ్రామంలో అడుగుపెట్టాడు. ఆయనకు ఆకాశవాణి వినిపించింది. “మాఫీ డౌవ్ చాలా ప్రశాంతమైన ప్రాంతం. అక్కడ ప్రజలు జీవించాలంటే పిల్లలను ప్రసవించకూడదు. జంతువులను పెంచకూడదు. శవాలను పూడ్చిపెట్టకూడదని ఆకాశవాణి అకిటీకి చెబుతుందట. దీంతో అప్పటి నుంచి ఈ ఆచారాలను కొనసాగిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. వీటిలో ఏ ఒక్క ఆచారాన్ని తప్పినా దేవుడికి కోపం వస్తుందని మాఫీ డవ్ గ్రామస్తులు నమ్ముతు.. పాటిస్తు వస్తున్నారు.

 

Latest Updates